పెళ్లి చేస్తేనే ఎన్నికల విధుల్లో పాల్గొంటా.. ఝలక్ ఇచ్చిన టీచర్..!

-

ప్రస్తుతం దేశంలో ఎన్నికల వేడి కొనసాగుతోంది. ఇప్పటికే నోటిఫికేషన్ విడుదల కాగా.. నామినేషన్లు, ప్రచారాలు, ఎన్నికల హోరు నడుస్తోంది. ఇక ఎన్నికలను ప్రశాంతంగా, విజయవంతంగా నిర్వహించేందుకు ఎన్నికల కమిషన్ అన్ని రకాల ప్రయత్నాలు చేస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా ఓ వింత పరిస్థితి ఎదురైంది. ఎన్నికల విధుల్లో ఉన్న ఓ టీచర్.. తాను ఎన్నికల విధులకు హాజరు కాలేను అంటూ చెప్పడం సంచలనంగా మారింది. దీనికి సంబంధించి ఎన్నికల శిక్షణకు కూడా హాజరు కాలేదు. అయితే తనకు పెళ్లి చేస్తేనే ఎన్నికల విధుల్లో పాల్గొంటాను అని చెప్పడం గమనార్హం.

దేశంలో ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా త్వరలోనే మధ్యప్రదేశ్ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వ అధికారులకు ఎన్నికల విధులు వేస్తున్నారు. ఈ క్రమంలోనే వారికి ఎన్నికలు ఎలా నిర్వహించాలి అనేదానిపై శిక్షణ ఇస్తున్నారు. అయితే అఖిలేశ్ కుమార్ మిశ్రా అనే ఓ ప్రభుత్వ ఉపాధ్యాయుడు వ్యవహరించిన తీరు ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఎన్నికల శిక్షణ తరగతులకు హాజరుకాకపోవడమే కాక.. ఎందుకు హాజరు కాలేదు అని షోకాజ్ నోటీసులు పంపిన అధికారులకు ఆశ్చర్యపోయే సమాధానం ఇచ్చాడు.

Read more RELATED
Recommended to you

Latest news