తెలంగాణలో పెరుగుతున్న డ్రగ్స్.. 6 నెలల్లో 20 కోట్ల డ్రగ్స్..!

-

తెలంగాణలో డ్రగ్స్ పెరిగిపోతున్నాయి. 6 నెలల వ్యవధిలో 20 కోట్ల విలువ చేసే డ్రగ్స్ స్వాధీనం చేసినట్లు డిసిఏ డైరెక్టర్ కమాలసన్ రెడ్డి తెలిపారు. 12,575 చోట్ల డిసిఏ తనిఖీలు నిర్వహించగా అందులో 1963 చోట్ల అక్రమాలపై చర్యలు తీసుకున్నారు డ్రగ్ కంట్రోల్ అధికారులు. 34 లైసెన్స్ లేని మెడికల్ షాపులు, గోడౌన్లు గుర్తించినట్లు అధికారులు పేర్కొన్నారు.

ఆహార పదార్థాలు తయారీ పేరుతో డ్రగ్ మ్యానుఫ్యాక్చర్ చేస్తున్న 14 యూనిట్లను కూడా అధికారులు గుర్తించారు. అలాగే అధిక రేట్లకు మందులు విక్రయిస్తున్న 61 షాపులపై కొరడా ఝుళిపించగా.. 51 మందికి కోర్టులు శిక్షణ విధించాయి. అయితే బల్క్ డ్రగ్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా గా తెలంగాణ గుర్తింపు పొందింది. దేశంలోని 35 శాతం ఫార్మా ఉత్పత్తులు తెలంగాణ లోనే ఉన్నాయి. అయితే లైసెన్స్ లేకుండా ఫార్మా ఉత్పత్తులు చేపడుతున్న వారిపై 59 కేసులు నమోదు చేసినట్లు డిసిఏ డైరెక్టర్ కమాలసన్ రెడ్డి స్పష్టం చేసారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version