KCR: బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. త్వరలో మరో ప్రజా ఉద్యమానికి శ్రీకారం చుట్టనున్నారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. వినాయక చవితి తర్వాత ప్రజా క్షేత్రంలోకి రాబోతున్నారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. కాంగ్రెస్ ప్రభుత్వ మెడలు వంచేందుకు కేసీఆర్ సిద్ధం అయ్యారు.
తెలంగాణలో నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా.. ప్రజా సమస్యలపై పోరాడేందుకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం అందుతోంది. ప్రజల నుండి వస్తున్న అభ్యర్థన మేరకు.. సెప్టెంబర్ 10 తర్వాత రంగంలోకి దిగేందుకు కేసీఆర్ ప్రణాళికలు చేస్తున్నారు. ఆరు గ్యారంటీల అమలు, అదుపుతప్పిన పాలనపై సమరశంఖం పూరించేందుకు సిద్ధమవుతున్న గులాబీ బాస్ కేసీఆర్…. వినాయక చవితి తర్వాత ప్రజా క్షేత్రంలోకి రాబోతున్నారు.