సామాన్యుడిపై మ‌రో భారం.. పెరిగిన సిమెంట్ ధ‌ర‌లు

-

తెలుగు రాష్ట్రాల ప్ర‌జ‌ల‌కు షాకింగ్ న్యూస్.. ఆంధ్ర ప్ర‌దేశ్ తో పాటు తెలంగాణ‌లో సిమెంట్ ధ‌ర‌ల‌ను పెంచుతున్న‌ట్టు సిమెంట్ డీల‌ర్లు తెలిపారు. ప్ర‌తి 50 కిలో గ్రాముల సిమెంట్ బ‌స్తాపై రూ. 20 నుంచి 30 వ‌ర‌కు ధ‌ర‌లు పెరుగుతాయని తెలిపారు. ప్ర‌స్తుతం పెరిగిన ధ‌ర‌ల‌తో 50 కిలో గ్రాముల బ‌స్తా రూ. 300 నుంచి రూ. 350 వ‌ర‌కు ఉంటుంద‌ని సిమెంట్ డీల‌ర్లు తెలిపారు. సిమెంట్ ధ‌రను పెంచిన కంపెనీల్లో పెన్నా సిమెంట్స్, అల్ట్రాటెక్, ఇండియా సిమెంట్స్, సాగ‌ర్ సిమెంట్స్, శ్రీ‌సిమెంట్, ఓరియంట్ సిమెంట్, ఎన్సీఎల్ ఇండ‌స్ట్రీస్, దాల్మియా భార‌త్, రామ్ కో సిమెంట్స్ ఉన్నాయి.

అయితే కొత్త ఏడాదిలో సిమెంట్ డిమాండ్ ఎక్కువ ఉంటుంద‌ని అందుకే సిమెంట్ ధ‌ర‌లు పెంచిన‌ట్టు డీల‌ర్లు తెలిపారు. ఇదీల ఉండ‌గా ఇప్ప‌టికే నిత్య‌వ‌స‌ర వ‌స్తువ‌లు, కూర‌గాయల ధ‌రలు ఆకాశాన్ని అంటుతున్నాయి. సామాన్యుడు ఈ అధిక ధ‌ర‌లతో తీవ్ర ఇబ్బందులు ప‌డుతున్నాడు. ఇలాంటి సంద‌ర్భంలో సిమెంట్ ధ‌ర‌లు కూడా పెర‌గ‌డంతో సామాన్యుడిపై మ‌రో భారం ప‌డిన‌ట్టు అయింది.

Read more RELATED
Recommended to you

Latest news