తెలుగు రాష్ట్రాల్లోని విద్యార్థులకు బిగ్ అలర్ట్. తెలుగు రాష్ట్రాల్లోని జూనియర్ ఇంటర్ కాలేజీలకు నేటితో వేసవి సెలవులు ముగియనున్నాయి. రేపటి నుంచి ఇంటర్ ఫస్టియర్, సెకండియర్ క్లాసులు ప్రారంభం కానున్నాయి. ఏపీలో జూన్ 14 వరకు మొదటి విడత ప్రవేశాల ప్రక్రియ కొనసాగుతుంది. తెలంగాణ ఏపీలో 2023-24 విద్యా సంవత్సరంలో 227 రోజులు ఇంటర్ కాలేజీలు నడవనున్నాయి.
తెలుగు రాష్ట్రాల్లో పిడుగులతో కూడిన వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. నేడు కోస్తాలో అక్కడక్కడ భారీ వర్షాలు పడే అవకాశం ఉందని పేర్కొంది. రానున్న మూడు రోజులు 40-50 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని తెలిపింది. అటు తెలంగాణలోని నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, భువనగిరి, మహబూబ్నగర్, నాగర్ కర్నూల్, జిల్లాలో ఈదురు గాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని పేర్కొంది.