ఖమ్మంలో పువ్వాడను గెలిపిస్తే పువ్వుల్లో పెట్టి చూసుకుంటాడు : సీఎం కేసీఆర్

-

ఎన్నికలు రావడం.. ఎవరో ఒకరు గెలవడం సర్వసాధారణమని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. ఖమ్మంలో ప్రజా ఆశీర్వాద సభలో పాల్గొన్నారు. ఎన్నికల్లో గెలిచిన అభ్యర్థి అందుబాటులో ఉంటాడా.. టాటా చెబుతాడా పరిశీలించుకోవాలి. ఓటు వేసే ముందు ప్రజలు విచక్షణతో ఆలోచించాలని సూచించారు. లకారం చెరువు ఇప్పుడు ఎంత సుందరంగా ఉంది.. ఒకప్పుడు ఎంత వికారంగా ఉందో గుర్తు చూసుకోవాలన్నారు. గతంలో అధికారంలో ఉన్న పార్టీలో ఏం చేశాయో గుర్తుంచుకోవాలి. తెలంగాణ వచ్చిన తరువాత ఖమ్మం రూపు రేఖలు మారిపోయాయి.

ఖమ్మం నగరంలో ఐటీ టవర్.. ఖమ్మంలో ప్రభుత్వ మెడికల్ కళాశాలలో.. ఆర్టీసీ కళ్యాణ మండపం నిర్మించారు. ఖమ్మంలో పువ్వాడను గెలిపిస్తే.. మిమ్మల్ని పువ్వుల్లో పెట్టి చూసుకుంటాడని సీఎం కేసీఆర్ తెలిపారు. ఖమ్మంలో జాతీయ రహదారులను విస్తరించామని తెలిపారు. బీఆర్ఎస్ ప్రభుత్వ విజన్ తో రాష్ట్రాభివృద్ధి జరిగిందని తెలిపారు సీఎం కేసీఆర్. రాబోయే రోజుల్లో ప్రాంతీయ పార్టీలే దేశవ్యాప్తంగా అధికారంలోకి రాబోతున్నాయి. మీకు పువ్వులు కావాలా..? ముళ్లు కావాలా తేల్చుకోండని ప్రజలను కోరారు కేసీఆర్.

Read more RELATED
Recommended to you

Latest news