సమగ్ర కుటుంబ సర్వే లో చిక్కులు ఎదుగురవుతున్నాయి. స్టిక్కరింగ్ ప్రక్రియ ఇప్పటికీ పూర్తి కాలేదు. సర్వే వివరాల సేకరణ మందకొడిగా సాగుతుంది. ఇప్పటి వరకు గ్రేటర్ హైదరాబాద్లో 1,10,000 ఇళ్లల్లో మాత్రమే సర్వే పూర్తి అయ్యింది. ఇంకా గ్రేటర్ హైదరాబాద్ లో 28 లక్షలకు పైగా సర్వే చేయాల్సిన ఇండ్లు ఉన్నాయి. చివరి క్షణంలో సర్వే ప్రశ్నలు కొత్తగా యాడ్ చేయడంతో మళ్లీ సర్వే ఫామ్స్ ను ప్రింట్ చేయించారు అధికారులు.
అయితే పూర్తి స్థాయిలో ఎన్యుమరేటర్లకు కొత్త సర్వే ఫామ్ లు అందలేదు. సర్వే చేయడానికి ఎన్యుమరేటర్లు ఎప్పుడు వస్తారో తెలియక ఇబ్బందులు పడుతున్నారు పబ్లిక్. స్కూల్ టీచర్లు అంగన్వాడి వర్కర్లు మధ్యాహ్నం తర్వాత వస్తుండడంతో రోజుకు పది పది ఇళ్లలో కూడా సర్వే పూర్తి కావడం లేదు. అలాగే ఎన్యుమరేటర్లకు పబ్లిక్ కూడా సహకరించడం లేదు.ఎన్యుమరేటర్లు అడుగుతున్న ప్రశ్నలకు సమాధానం చెప్పడానికి తిరస్కరిస్తున్న పబ్లిక్.. ఆధార్ కార్డు వివరాలను ఇవ్వడానికి కూడా వెనకాడుతున్నారు.