కొత్త రేషన్ కార్డుల కోసం తెలంగాణ ప్రజలు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. రీసెంట్‌గా పెళ్లిళ్లు అయిన జంటలు, గతంలో టెక్నికల్ సమస్యల వలన రేషన్ కార్డులు రాని వారంతా గత పదేళ్లుగా ఎదురుచూస్తున్నారు.రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాడ్డాక రేషన్ కార్డుల జారీపై ప్రకటన వెలువడింది.దీంతో మరోసారి వారిలో ఆశలు చిగురించాయి.
ప్రజాపాలనలో భాగంగా రేషన్ కార్డుల కోసం కొత్తగా 10 లక్షల వరకు దరఖాస్తులు వచ్చినట్లు అధికారులు వెల్లడించారు. రేవంత్ సర్కార్ అధికారంలోకి వచ్చి ఏడాది కావొస్తుంది.అయినా రేషన్ కార్డులు జారీ కాలేదు. ఈ క్రమంలోనే మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి రేషన్ కార్డుల జారీ పై కీలక ప్రకటన చేశారు. కులగణన, ధాన్యం సేకరణ పూర్తయ్యాక తెల్లరేషన్ కార్డుల జారీపై నిర్ణయం తీసుకుంటామని పేర్కొన్నారు. ఈ మేరకు మరో రెండు నెలల సమయం పడుతుందని తెలుస్తోంది.