ఊహించినట్టే నాపై ఐటీ దాడులు జరుగుతున్నాయి : పొంగులేటి

-

మాజీ ఎంపీ, పాలేరు కాంగ్రెస్ అభ్యర్థి పొంగులేటి శ్రీనివాస్ ఇళ్లు, కార్యాలయాల్లో ఇవాళ తెల్లవారుజాము నుంచి ఐటీ సోదాలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ సోదాలపై పొంగులేటి స్పందించారు. బీఆర్ఎస్, బీజేపీలు కలిసి కాంగ్రెస్ పార్టీని ఇబ్బంది పెట్టాలని చూస్తున్నాయని మండిపడ్డారు. బీజేపీలోకి రావాలని తనపై ఒత్తిడి చేశారని.. ఆ పార్టీలోకి వెళ్లలేదనే కోపంతో.. మరోవైపు కాంగ్రెస్‌ గ్రాఫ్‌ పెరిగిందని ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆరోపించారు.

ponguleti

“కేసీఆర్ కుటుంబాన్ని విమర్శిస్తే ఐటీ దాడులు జరుగుతాయని నాకు తెలుసు. మేము ఉహించినట్లే ఐటీ దాడులు జరుగుతున్నాయి. ఉద్దేశపూర్వకంగానే నామినేషన్‌ వేసే రోజే ఐటీ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. ఈరోజు ఉదయం 5 గంటల నుంచి సుమారు 30 ప్రాంతాల్లో సోదాలు చేస్తున్నారు. తెల్లవారుజామున మా ఇళ్లలోకి అధికారులు మూకుమ్మడిగా వచ్చారు. మా మొబైల్ ఫోన్లన్నీ తీసుకున్నారు. చివరికి నన్ను జైలులో పెట్టినా వెనక్కి తగ్గను. కాంగ్రెస్‌ను అధికారంలోకి తెచ్చేందుకు జైలులో ఉండేందుకు సిద్ధం. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కుట్ర పన్ని చేస్తున్న దాడులను ఖండిస్తున్నాను.” అని పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మండిపడ్డారు.

Read more RELATED
Recommended to you

Latest news