హైదరాబాద్ లో అభివృద్ది ఇప్పటి దాకా చేసింది ట్రైలర్ మాత్రమే.. అసలు సినిమా ముందుందన్నారు మంత్రి కేటీఆర్. వచ్చే ప్రభుత్వంలో మరింత వేగంగా హైదరాబాద్‌ను అభివృద్ధి చేసి చూపిస్తామని ప్రకటించారు మంత్రి కేటీఆర్. తెలంగాణ బిల్డర్స్ అసోసియేషన్ మీటింగ్ మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. ఔటర్ రింగ్ రోడ్డు (ఓఆర్ఆర్), రీజినల్ రింగ్ రోడ్డు (ఆర్ఆర్ఆర్) మధ్యలో కొత్త హైదారాబాద్ నిర్మాణం చేసి చూపిస్తామని తెలిపారు.
ప్రతిపక్ష పార్టీలకు 11 సార్లు అవకాశం ఇస్తే ఏం చేశారు.. ఒక్క ఛాన్స్ ఎందుకు ఇవ్వాలి వీళ్లకు..? అని ప్రశ్నించారు. బోర్ కొట్టిందని కొత్త ప్రభుత్వం రావాలని కోరుకుంటారా..? అభివృద్ది చేసే వాడు ఇంకొన్నెళ్లు ఉంటే తప్పేంటి? అని ప్రశ్నించారు మంత్రి కేటీఆర్. 1989లోనే హైదరాబాద్ కు తొలి ఐటి కంపెనీ ‘INTERGRAPH’ వచ్చిందని చెప్పారు. తెలంగాణలో 2014 వరకు 25 ఏళ్లలో రూ. 55 వేల కోట్ల ఐటి ఎగుమతులు జరిగితే….2022-23లోనే రూ. 57 వేల కోట్ల ఎగుమతులు సాధించాయని వివరించారు.