రాజ‌కీయాల‌కు అధికారుల‌ను పావుగా వాడుకోవ‌డం స‌రికాదు : డీజీపీ మ‌హేంద‌ర్ రెడ్డి

-

రాజ‌కీయ నాయ‌కులు.. అధికారుల‌ను రాజ‌కీయాల కోసం పావులుగా వాడు కోవ‌డం స‌రి కాద‌ని తెలంగాణ రాష్ట్ర డీజీపీ మ‌హేంద‌ర్ రెడ్డి అన్నారు. తానను ప్ర‌భుత్వం బ‌ల‌వంతంగా సెల‌వుపై పంపించింద‌ని వ‌స్తున్న ఆరోప‌ణ‌లు నిజం లేద‌ని డీజీపీ అన్నారు. అలాగే త‌న‌పై తెలంగాణ కాంగ్రెస్ పార్టీ చీఫ్ రేవంత్ రెడ్డి చేస్తున్న ఆరోపణ‌ల్లో నిజం లేద‌ని డీజీపీ మ‌హేంద‌ర్ రెడ్డి స్ప‌ష్టం చేశారు. నిజా నిజాలు తెలుసుకోకుండా.. ఇలా ఆరోపిణ‌లు చేయ‌డం త‌గ‌ద‌ని అన్నారు.

అయితే తాను ఇంట్లో ప్ర‌మాద‌వ శాత్తు కింద పడ్డాన‌ని అన్నారు. దీంతో త‌న ఎడ‌మ చేతి భుజానికి గాయం అయింద‌ని తెలిపారు. వైద్యులను సంప్ర‌దిస్తే.. రెండు వారాల పాటు విశ్రాంతి తీసుకోవాల‌ని సూచించార‌ని అన్నారు. అందుకే తాను.. ఫిబ్ర‌వ‌రి 18 వ తేదీ నుంచి మార్చి 4 వ తేదీ వ‌ర‌కు సెల‌వులు తీసుకున్న‌ట్టు ప్ర‌క‌టించారు. అలాగే గాయం కోసం వైద్యుల స‌ల‌హాతో ఫిజియో థెరపీ చేసుకుంటున్నట్టు తెలిపారు. అయితే దీనిపై కొంద‌రు త‌ప్పు గా ప్ర‌చారం చేసి పోలీసు శాఖ ను అవ‌మానించేలా వ్య‌వ‌హ‌రిస్తున్నార‌ని అన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version