బతుకమ్మ చీరలను సూరత్ నుంచి తీసుకొచ్చింది వాస్తవమే.. కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు

-

బతుకమ్మ చీరలను తొలుత సూరత్ నుంచి తీసుకొచ్చింది వాస్తవమేనని కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇవాళ అసెంబ్లీలో ద్రవ్య వినిమయ బిల్లు చర్చ సందర్భంగా మాట్లాడారు కేటీఆర్. బతుకమ్మ చీరల పంపిణీ గురించి సిరిసిల్ల కార్మికులకు కాంట్రాక్టు ఇవ్వాలని కేటీఆర్ కోరారు. అతి తక్కువ సమయంలో చీరలను తయారు చేయించడం సమయం లేక సూరత్ నుంచి తీసుకొచ్చినట్టు తెలిపారు కేటీఆర్.  అంతకు ముందు సీఎం రేవంత్ రెడ్డి బతుకమ్మ చీరల గురించి పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు.

గత బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రారంభించిన బతుకమ్మ చీరల పంపిణీలో అవినీతి జరిగిందని సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు. తక్కువ ధరకు సూరత్ నుంచి చీరలు తీసుకొచ్చి పంపిణీ చేశారని.. పైకి మాత్రం నేత కార్మికులకు పనులు కల్పించామని అబద్ధాలు చెప్పారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం బినామీలకు బతుకమ్మ చీరల కాంట్రాక్ట్ ఇచ్చిందన్నారు. నేత కార్మికులకు రూ.275 కోట్ల బకాయిలు పెడితే మా ప్రభుత్వం వచ్చాకే బకాయిలు చెల్లించామని చెప్పారు. సభను తప్పుదోవ పట్టించడానికి కేటీఆర్ ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు సీఎం రేవంత్ రెడ్డి.

 

Read more RELATED
Recommended to you

Latest news