రేవంత్ చిట్టి నాయుడు కాదు..గట్టి నాయుడు – జగ్గారెడ్డి

-

రేవంత్ చిట్టి నాయుడు కాదు..గట్టి నాయుడు అన్నారు కాంగ్రెస్‌ మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి. బీఆర్‌ఎస్‌ పార్టీ సోషల్ మీడియాపై ప్రెస్‌ మీట్‌ నిర్వహించారు జగ్గారెడ్డి. ఈ సందర్భంగా జగ్గారెడ్డి మాట్లాడుతూ… కేటీఆర్ నీకు కొంచెం గౌరవం ఇస్తా…. కానీ మీ సోషల్ మీడియాను కంట్రోల్ లో పెట్టు అని విజ్ఙప్తి చేశారు. లేదంటే మా సంగతి తెలియదని హెచ్చరించారు. కాంగ్రెస్ వాళ్ళను లుచ్చా లు అంటున్నాడు కేటీఆర్… ఆయనే.. లుచ్చా లకే లుచ్ఛా అంటూ రెచ్చిపోయారు.

jagga reddy

రేవంత్ చిట్టి నాయుడు కాదు.. గట్టి నాయుడు…. రేవంత్ గట్టి పిండమన్నారు. రేవంత్ తొడ కొడితే…కేటీఆర్ కి కాళ్ళు వనుకుతాయని హెచ్చరించారు. ధైర్యం చేయడంలో రేవంత్.. జగ్గారెడ్డి తో పోటీ పడలేరు అంటూ కేటీఆర్‌, హరీష్ లపై రెచ్చిపోయారు. కేటీఆర్..హరీష్..చిన్న పిల్లల చేష్టలు మానుకోండన్నారు. తప్పుడు రాతలు రాయిస్తే..ఖైరతాబాద్ సెంటర్ లో వాణ్ణి తీసుకువచ్చి ముక్కు నేలకు రాయిస్తామని హెచ్చరించారు. నీ సోషల్ మీడియా కంట్రోల్ కాకపోతే.. కేటీఆర్..హరీష్ లను నడిరోడ్డు మీద నిలదీస్తామని వార్నింగ్‌ ఇచ్చారు జగ్గారెడ్డి.

Read more RELATED
Recommended to you

Latest news