ఎన్నికల్లో తన ఓటమిపై స్పందించిన జగ్గారెడ్డి

-

కాంగ్రెస్ పార్టీ వాగ్థానాల అమలుపై కాంగ్రెస్ సీనియర్ నేత జగ్గారెడ్డి కొన్ని వ్యాఖ్యలు చేశారు. సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీ, మల్లిఖార్జున్ ఖర్గే, సీఎం రేవంత్ రెడ్డి అందరూ కలిసి ఎన్నిక్లల్లో ఇచ్చిన హామీల అమలుపై కీలక దృష్ఠి సారించారన్నారు. ఈ రోజు ఆరోగ్య శ్రీ పథకం కింద వైద్య చికిత్స పరిమితిని10 లక్షల వరకూ పెంచినట్లు తెలిపారు.

 

సంగారెడ్డి నియోజకవర్గంలో అధికారులు హామీల అమలులో ఎలాంటి ఆశ్రద్ధ, నిర్లక్ష్యం వహించొద్దు అని చెప్పారు. ఇక నుండి సంగారెడ్డి నియోజకవర్గంలో జరిగే ప్రతి అధికారిక కార్యక్రమానికి తన సీతమణి నిర్మల జగ్గారెడ్డి ని పిలవాలన్నారు. ఆమె సంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు అని చెప్పుకొచ్చారు. ఈ విషయంలో అధికారులందరూ బాధ్యతగా మెలగాలన్నారు.

ఈరోజు సోనియా గాంధీ పుట్టిన రోజు సందర్భంగా మహిళలకు గిఫ్ట్ ఇస్తున్నామని.. మాట ఇచ్చిన్నట్లు మహిళలకు ఉచిత బస్ ప్రయాణం మొదలు పెడుతున్నాట్లు ప్రకటించారు. ఇక నుండి మహిళలు రాష్ట్రంలో ఎక్కడైనా టికెట్ లేకుండా ఫ్రీగా బస్సులో వెళ్ళిరావొచ్చు అన్నారు. మిగితా 6 గ్యారెంటీలను కూడా ఒక్కొక్కటిగా అమలు చేస్తామన్నారు. తాను ఈ ఎన్నికల్లో కొన్ని అనివార్య కారణాల వల్ల, రాజకీయ పరిస్థితుల వల్ల ఓడిపోయినప్పటికీ.. హుందాగా వ్యవహారించానన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news