రైతుబంధు అమలు పై మంత్రి సీతక్క కీలక వ్యాఖ్యలు

-

తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి డిసెంబర్ 07, 2024న ప్రమాణ స్వీకారం చేసిన విషయం తెలిసిందే. ఇవాళ అసెంబ్లీలో ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం చేశారు. అందులో కొంత మంది ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారానికి హాజరుకాలేదు. శాసన సభ ప్రాంగణంలో మంత్రి హరీశ్ రావు రైతు బంధు గురించి ప్రస్తావించారు. ముఖ్యంగా రైతులకు బోనస్ ఇస్తాం అని ఎన్నికల సమయంలో చెప్పారు. బోనస్ కింద రూ. 500 ఇస్తాం అన్నారు. వడ్లకు 5వందల బోనస్ ఎప్పుడు ఇస్తారు? వడ్లు కొనుగోలు ఎప్పుడు చేస్తారు చెప్పాలన్నారు.

ఇందుకు నూతనంగా ప్రమాణ స్వీకారం చేసిన మంత్రి సీతక్క స్పందించారు. ముఖ్యంగా సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావుకు కౌంటర్ ఇచ్చారు సీతక్క. బీఆర్ఎస్ హయాంలో రైతులు ఇబ్బంది పడ్డారని తెలిపారు. రైతుబంధు వస్తే.. బీఆర్ఎస్ నాయకులకు వందలాది ఎకరాల భూమి ఉందని.. వారికి లాభం కలుగుతుందని హరీశ్ రావు రైతుబంధు గురించి ప్రస్తావించారు. అందుకే ఇప్పుడు పెద్ద ఫాం హౌస్ ల ఓనర్లు, మాజీ మంత్రులు, రైతు బంధు రాలేదని బాధ పడుతున్నారు. సీఎం రేవంత్ రెడ్డి సమీక్షించిన తరువాత రైతులకు డబ్బులు చెల్లిస్తాం.. ఇది రైతు ప్రభుత్వం.. అన్ని పథకాలను తప్పకుండా అమలు చేస్తామని స్పష్టం చేశారు సీతక్క.

Read more RELATED
Recommended to you

Latest news