ఈ అసెంబ్లీ సమావేశాల్లోనే జాబ్‌ క్యాలెండర్‌

-

ఈనెల 23వ తేదీ నుంచి రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. 25వ తేదీన రాష్ట్ర బడ్జెట్ను ప్రవేశపెట్టనున్నారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. త్వరలో ప్రారంభం కానున్న అసెంబ్లీ సమావేశాల్లోనే జాబ్‌ క్యాలెండర్‌ ప్రకటిస్తామని తెలిపారు. ఏటా మార్చిలోగా అన్ని శాఖల నుంచి ఖాళీల వివరాలు సేకరించి జూన్‌ 2లోగా ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు జారీ చేస్తామని వెల్లడించారు. డిసెంబరు 9లోగా నియామకాలు పూర్తి చేస్తామని పేర్కొన్నారు.

నిరుద్యోగుల సమస్యలు పరిష్కరించడమే తమ ప్రభుత్వ తొలి ప్రాధాన్యం అని సీఎం రేవంత్ అన్నారు. గత పదేళ్లలో నిరుద్యోగులకు తీరని నష్టం జరిగిందని.. వారి ఇబ్బందులను గుర్తించి గ్రూప్‌-2 పరీక్ష వాయిదా వేశామని తెలిపారు. పకడ్బందీ ప్రణాళికతో పరీక్షలు సమర్థంగా నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించిందని వెల్లడించారు. ప్రిలిమ్స్‌ విజేతలు మెయిన్స్‌ కోచింగ్‌ కోసం అవసరమైన స్టడీ మెటీరియల్‌ కోసం, హాస్టల్‌ ఖర్చులు, మెరుగైన శిక్షణ కోసం ఉపయోగపడేలా రూ.లక్ష ఆర్థిక సాయాన్ని అందిస్తున్నామని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news