కేటీఆర్, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బెవాకూఫ్ మాటలు మాట్లాడుతున్నారు – మంత్రి జూపల్లి కృష్ణారావు

-

కేటీఆర్, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బెవాకూఫ్ నాయాల్లు, బెవాకూఫ్ మాటలు మాట్లాడుతున్నారని ఫైర్‌ అయ్యారు మంత్రి జూపల్లి కృష్ణారావు. హత్యకు గురైన శ్రీదర్ రెడ్డి దుర్మార్గుడు కాదు.. ఈ హత్యను అందరూ ఖండించాలి, నేను కూడా ఖండిస్తున్నానని తెలిపారు మంత్రి జూపల్లి కృష్ణారావు.

jupally slams ktr and rs praveen kumar

శ్రీధర్ రెడ్డి కుటుంబంలో భూతగాదాలు ఉన్నాయి ఉన్నాయని… మంత్రి జూపల్లి కృష్ణారావు క్లారిటీ ఇచ్చారు. చనిపోయిన శ్రీధర్ రెడ్డి దుర్మార్గుడు కాదు.. హత్య బాధాకరం అన్నారు. కానీ శ్రీధర్ రెడ్డి హత్య నేపథ్యంలో నాపై ఆరోపణలు చేశాడని కేటీఆర్‌ పై మండిపడ్డారు. రాజకీయంగా వాడుకోవడం కోసం నాపై నిందలు వేస్తున్నారు….శ్రీధర్ రెడ్డి ఎలాంటోడో ఊరికి వెళ్లి అడగండి అన్నారు.

కానీ శ్రీధర్ రెడ్డి హత్య తప్పు అన్నారు. శ్రీధర్ రెడ్డి అన్నదమ్ముల పంచాయతీకి నాకేం సంబంధం అని ప్రశ్నించారు. మా కార్యకర్తను కూడా చంపారు…నీలాగే నేను ఆరోపణలు చేయలేదన్నారు. బట్టకాల్చి మీద వేస్తాం అంటే ఏం రాజకీయం చేస్తున్నట్టు అని ప్రశ్నించారు.

Read more RELATED
Recommended to you

Latest news