విద్యుత్ కొనుగోళ్ల వ్యవహారం.. కేసీఆర్​కు కమిషన్ మరో లేఖ

-

తెలంగాణలో యాదాద్రి, భద్రాద్రి విద్యుత్ సంస్థల నిర్మాణం, ఛత్తీస్​గడ్ విద్యుత్ కొనుగోళ్ల అంశం వ్యవహారం కాక రేపుతోంది. గత ప్రభుత్వం అనుసరించిన విధానంపై విచారణ జరుపుతున్న జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి ఇప్పటికే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్​కు లేఖ రాసిన విషయం తెలిసిందే. మరోవైపు ఈ వ్యవహారంలో కేసీఆర్ హైకోర్టును కూడా ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో ఈ కొనుగోళ్ల అంశంపై మరింత సమాచారం ఇవ్వాలని కేసీఆర్​కు ఈనెల 19న విచారణ కమిషన్ జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ రెండో లేఖ రాసిన విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది.

గతంలో మొదటి లేఖ రాసి ఈ నెల 15 లోపు సమాధానం ఇవ్వాలని కోరడంతో 15వ తేదీన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సుదీర్ఘ సమాధానం ఇచ్చారు. ఆ సమాధానానికి సందేహాలను జోడిస్తూ జస్టిస్ నరసింహా రెడ్డి ఈ నెల 19వ తేదీన మరోసారి జస్టిస్ నరసింహా రెడ్డి కేసీఆర్​కు మరో లేఖ రాశారు. ఈ నెల 27వ తేదీ లోపు సమాధానం అందజేయాలని కోరారు.

Read more RELATED
Recommended to you

Latest news