వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డికి పట్టిన గతే కేసీఆర్‌కు పడుతుంది – కేఏ పాల్‌

వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డికి పట్టిన గతే కేసీఆర్‌కు పడుతుందని సంచలన వ్యాఖ్యలు చేశారు కేఏ పాల్‌. గత ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో ఎన్ని నెరవేర్చినవో చెప్పాకే మునుగోడుకు రా…. నేను మునుగోడు లోనే ఉన్న.. దమ్ముంటే మునుగోడు లో బహిరంగ చర్చ కి నేను సిద్ధం, నువ్వు సిద్ధమా కేసీఆర్….? అని ఛాలెంజ్‌ చేశారు కేఏ పాల్‌.

ఇండియా-పాకిస్తాన్ మ్యాచ్ లో నిన్న భారత్ ఎలా గెలిచిందో… మునుగోడు లో జరగబోయే యుద్ధంలో గెలుపు నాదేనని… రాష్ట్రాన్ని, రాష్ట్ర ప్రజల రక్తాన్ని జలగల పీల్చుకు తింటున్న కేసీఆర్ & అతని దండుపాళ్యం ముఠాకు ఓటుతో తరిమికొట్టండని కోరారు. మునుగోడు ప్రజలు ఇచ్చే తీర్పు తీర్పు… తెలంగాణ ప్రజాల భవిష్యత్ కు మార్పు అవ్వాలని.. కే ఏ పాల్ ఆసక్తి కర వ్యాఖ్యలు చేశారు.

మునుగోడు ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీస్తే సమాధానం చెప్పలేని కెసిఆర్, అతని చెడ్డి గ్యాంగ్ దమ్ముంటే బహిరంగ చర్చ కు రావాలని డిమాండ్ చేశారు. దళితున్ని ముఖ్యమంత్రి చేస్తానని తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న దళితుల ఆత్మగౌరవాన్ని అవమానించిన మూర్ఖుడు కేసీఆర్ కు మునుగోడు ప్రజలు గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు.