రేవంత్.. నువ్వు మగాడివైతే 17కు 17 ఎంపీలను గెలిపించి చూపించు – కడియం శ్రీహరి

-

 

BRS పార్టీ ఎమ్మెల్యే కడియం శ్రీహరి సంచలన వ్యాఖ్యలు చేశారు. రేవంత్ రెడ్డి నువ్వు మగాడివైతే రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో 17కు 17 ఎంపీలను గెలిపించి నీ మగతనం చూపించూ అంటూ ఎమ్మెల్యే కడియం శ్రీహరి కౌంటర్‌ ఇచ్చారు. రేవంత్ రెడ్డి మల్కాజ్‌గిరి ఎంపీగా ఉండి.. మల్కాజ్‌గిరి పార్లమెంట్ పరిధిలోని 7 అసెంబ్లీ స్థానాల్లో ఒక్క ఎమ్మెల్యేను కూడా ఎందుకు గెలిపించలేదని చురకలు అంటించారు ఎమ్మెల్యే కడియం శ్రీహరి.

kadium srihari counter to revanth reddy

రేవంత్ రెడ్డి… సిఎం హోదాలో కూర్చున్న తరువాత తన భాషను మార్చుకుంటాడని భావించము….ముఖ్యమంత్రి తన సహనాన్ని కోల్పోయి మాజీ ముఖ్యమంత్రి పై విమర్శలు చేస్తున్నాడు దీనిని ఖండిస్తున్నాము….పదవి భాద్యతలు చేపట్టిన తరువాత తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికి సేవ చేయాలని కోరారు. గత ప్రభుత్వం లో 10 సంవత్సరాలు కేసిఆర్ ముఖ్యమంత్రి గా దేశంలో ప్రశంసలు పొందారని గుర్తు చేశారు కడియం శ్రీహరి.

Read more RELATED
Recommended to you

Latest news