పీహెచ్‌డీ ప్రవేశాల్లో అవకతవకలు.. నేడు కేయూ బంద్​కు పిలుపునిచ్చిన విద్యార్థి సంఘాలు

-

కాకతీయ యూనివర్శిటీలో గత కొన్నిరోజులుగా పీహెచ్​డీ ప్రవేశాల్లో అవకతవకలపై ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఓవైపు పీహెచ్​డీ కేటగిరి-2 ప్రవేశాల్లో అక్రమాలపై నిరసన తెలుపుతుంటే.. మరోవైపు టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు కొట్టారని ఆరోపిస్తూ 6 రోజులుగా విద్యార్థులు దీక్షలు చేస్తున్నారు. కేటగిరి-2లో అన్ని విభాగాల్లో ఖాళీలను గుర్తించి మెరిట్‌ ప్రకారం రెండో జాబితా ప్రకటించి అడ్మిషన్లు జరపాలని డిమాండ్‌ చేస్తున్నారు. విద్యార్థులపై పెట్టిన కేసులు ఉపసంహరించుకోవటంతోపాటు.. రిజిస్ట్రార్‌ని తక్షణమే తొలగించాలని అంటున్నారు.

ఈ నేపథ్యంలో ఇవాళ కేయూతో పాటు జిల్లా బంద్​కు విద్యార్థి సంఘాలు పిలుపునిచ్చాయి. ఈ బంద్‌కు బీజేపీ, కాంగ్రెస్‌ సహా ఇతర పార్టీల సంఘీభావం తెలిపాయి. కేటగిరి-1 కింద సెట్‌, నెట్‌తోపాటు ఎం-ఫిల్‌ ఉన్నవారు నేరుగా పీహెచ్​డీ సీట్లు పొందుతున్నారు. కేటగిరి-2లో ప్రవేశ పరీక్ష రాసిన వారికి రోస్టర్‌ ప్రకారం సీట్లు కేటాయించాల్సి ఉంది. అయితే రెండో కేటగిరిలో పైరవీలతో సీట్లు కట్టబెడుతున్నారని విద్యార్థులు ఆరోపిస్తున్నారు. సీట్ల భర్తీకి ముందే రోస్టర్‌, కేటగిరీలను నిర్ణయించి వెబ్‌సైట్లో పొందుపరచాల్సి ఉన్నా మార్గదర్శకాలను పాటించట్లేదంటున్నారు. గతేడాది నోటిఫికేషన్‌ ఇచ్చినా ఆలస్యంగా ఫలితాలు విడుదల చేయటంపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news