ఒక వ్యక్తి ‘సెలవు’ కొన్ని జీవితాలని నాశనం చేసింది !

-

వికారాబాద్ జిల్లాలో కల్తీకల్లు తాగి అస్వస్థతకు గురయిన బాధితుల సంఖ్య భారీగా పెరుగుతోంది. 200 మందికి పైగా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. నిన్న మధ్యాహ్నం నుండి నుంచి ఫిట్స్ వచ్చి జనాలు పడిపోతున్నారు. ఇదంతా ఒక ఎత్తు అయితే కల్లు డిపోలు సీజ్ చేయడంతో… నిన్న కల్లు దొరకక పిచ్చిపిచ్చిగా ప్రవర్తింస్తున్నారు కొందరు.

నిజానికి కల్లు డిపోలో నిత్యం కల్లు కలిపే వ్యక్తి సెలవుపై వెళ్ళాడు… దీంతో వేరే వ్యక్తులకు ఎంత మోతాదులో కలపాలో తెలియక కల్లు తయారు చేశారని తేలింది. డైజోఫామ్ మోతాదు తక్కువ కావడం వల్లే.. కల్లు తాగిన వాళ్లు అస్వస్థతకు గురవుతున్నారని తేలింది. వికారాబాద్ ప్రభుత్వ ఆస్పత్రి, వికారాబాద్ డెంటల్ ఆస్పత్రి తోపాటు రెండు ప్రైవేట్ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు బాధితులు. అయితే క్రమక్రమంగా బాధితుల సంఖ్య పెరుగుతున్న నేపధ్యంలో గ్రామాల్లో హెల్త్ క్యాంపులు ఏర్పాటు చేశారు అధికారులు. 

Read more RELATED
Recommended to you

Latest news