తన చిన్న కొడుకుకు పరీక్షలు ఉన్న తరుణంలో..కల్వకుంట్ల కవిత కీలక నిర్ణయం తీసుకున్నారు. తన చిన్న కొడుకు పరీక్షల నేపథ్యంలో మధ్యంతర బెయిల్ కోరుతూ కవిత పిటిషన్ వేశారు. అయితే… కల్వకుంట్ల కవిత వేసిన మధ్యంతర బెయిల్ పిటిషన్‌పై ఇవాళ విచారణ జరుగనుంది.
ఢిల్లీ లిక్కర్ స్కాంలో అరెస్టయిన కవిత… జ్యుడీషియల్ రిమాండ్‌లో భాగంగా తిహార్ జైల్లో ఉన్నారు. ఇక ఇవాళ కవిత పిటిషన్‌పై రౌజ్ అవెన్యూ కోర్టు లో విచారణ జరుగనుంది. ఈ పిటీషన్ పై స్పెషల్ కోర్ట్ జడ్జి కావేరి బవేజ విచారణ జరపనున్నారు. అటు నేటితో ముగియనుంది ఢిల్లీ సీఎం కేజ్రివాల్ కస్టడీ. లిక్కర్ కేసులో మార్చి 21 న కేజ్రివాల్ ను అరెస్ట్ చేసింది ఈడీ. ఇవాళ 11 గంటలకు రౌస్ ఎవిన్యూ కోర్టులో ఢిల్లీ సీఎం కేజ్రివాల్ ను హాజరు పర్చనుంది.