kalvakuntla kavitha: ఢిల్లీ లిక్కర్ స్కాంలో అరెస్ట్ అయిన బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కు బిగ్ షాక్ తగిలింది. కల్వకుంట్ల కవిత కవిత జ్యూడిషియల్ రిమాండ్ పొడిగించారు. ఈ నెల 23 వరకు బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత జ్యూడిషియల్ రిమాండ్ పొడగించింది రౌస్ అవెన్యూ కోర్టు.
ఢిల్లీ లిక్కర్ పాలసీ మనీ లాండరింగ్ కేసు దర్యాప్తు కొనసాగుతుందని, కవిత జ్యుడీషియల్ కస్టడీ 14 రోజులు పొడిగించాలని కోర్టును కోరింది ఈడీ. కవిత జ్యుడీషియల్ కస్టడీ పొడిగించడానికి ఈడీ వద్ద కొత్తగా ఏమి లేవని కవిత తరపు న్యాయవాది రానా తెలిపారు. 2022 నుంచి కేసు దర్యాప్తు సాగుతుంది కవిత ప్రభావితం చేసే వ్యక్తి అని అంటున్నారు.. అలా ఏమి లేదని కోర్టుకు రానా తెలిపారు. ఇక ఈ తరుణంలోనే కల్వకుంట్ల కవిత కవిత జ్యూడిషియల్ రిమాండ్ పొడిగించారు. ఈ నెల 23 వరకు బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత జ్యూడిషియల్ రిమాండ్ పొడగించింది రౌస్ అవెన్యూ కోర్టు.