బీర్లు తాగడం లో సరికొత్త రికార్డును సృష్టించింది కరీంనగర్ జిల్లా. ఓవైపు మండుతున్న ఎండలు.. మరోవైపు ఉక్కపోత… వాటినుంచి సేదతీరేందుకు మద్యం ప్రియులు బీర్ ను చేత పడుతున్నారు. గత నెల రోజులుగా ఎండలు పెరగడంతో బీర్ల అమ్మకాలు ఘనంగా పెరిగాయి. గత ఏడాదితో పోల్చితే ఏప్రిల్ నెలలో ఈ సారి 90 శాతం అమ్మకాలు పెరిగాయి. కరీంనగర్ జిల్లాలో 150 శాతం పెరుగుదలతో తెలంగాణ రాష్ట్రంలోనే మొదటి స్థానంలో ఉంది.
మద్యం కంటే ఎక్కువమంది బీర్లు ఎంచుకోవడం వల్ల అమ్మకాలు పెరిగాయని దుకాణదారులు చెబుతున్నారు. ఒక కరీంనగర్ ఉమ్మడి జిల్లా లోనే 11 నెలల్లో 1000 కోట్ల మేర బిజినెస్ జరిగినట్లు అంచనా వేస్తున్నారు.అయితే గత ఏడాదితో పోల్చుకుంటే ఈ సంవత్సరం బీర్ల అమ్మకాలు జరిగినట్లు చెబుతున్నారు.భానుడి ప్రభావానికి మందుబాబులు బీర్లు ఎక్కువగానే తాగేశారు అంటున్నారు.