దిల్లీ లిక్కర్ స్కామ్ కేసు వ్యవహారంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ప్రస్తుతం తిహాడ్ జైల్లో ఉన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కవిత బెయిల్ పిటిషన్పై విచారణ ఈనెల 27వ తేదీకి వాయిదా పడింది. కవిత బెయిల్ పిటిషన్‌పై సీబీఐ అధికారులు కోర్టులో కౌంటర్ దాఖలు చేశారు. మరోవైపు ఈడీ మాత్రం కౌంటర్ దాఖలు చేసేందుకు మరికొంత సమయం కోరింది. రేపటిలోగా కౌంటర్ దాఖలు చేస్తే శుక్రవారం విచారణకు తాము సిద్దంగా ఉన్నామన్న కవిత తరపు న్యాయవాదులు అనగా.. తమకు సమయం కావాలని గురువారం లోపు దాఖలు చేస్తామని ఈడి న్యాయవాది అన్నారు.
ఈ నేపథ్యంలో ఈడీ, సీబీఐ కౌంటర్లపై కవిత న్యాయవాదులు రీజాయిండర్ వేస్తామని తెలిపారు. దిల్లీ మద్యం కేసులో మనీశ్ సిసోదియాకు బెయిల్ వచ్చిందని కోర్టుకు తెలిపారు. దిల్లీ మద్యం కేసులో ఏకైక మహిళా నిందితురాలిగా కవిత ఉందని.. 4 నెలలుగా కవితను జైళ్లో ఉంచారని చెప్పారు. ఇరువురి వాదనల అనంతరం కవిత బెయిల్ పిటిషన్పై విచారణ ఈనెల 27కు వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకుంది.