BREAKING : కవిత కోసం రంగంలోకి తెలంగాణ మంత్రులు దిగారు. ఢిల్లీలోని.. జంతర్ మంతర్ లో 10 గంటలకు కవిత దీక్ష ప్రారంభం కానుంది. ఈ దీక్షను ఉద్దేశించి ప్రారoభ ఉపన్యాసం చేయనున్నారు బీఆర్‌ఎస్ పార్టీ ఎమ్మెల్సీ కవిత. ఆమె ఉపన్యాసం తర్వాత ఏచూరి మాట్లాడనున్నారు.
ఇక ఈ దీక్షకు 18 రాజకీయ పార్టీలు మద్దతు మద్దతు తెలుపుతున్నాయి. అటు జంతర్ మంతర్ దీక్షలో కూర్చోనున్నారు తెలంగాణ మంత్రులు సబిత, సత్యవతి రాథోడ్. ఇక అటు కవిత నోటీసులపై తెలంగాణ సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇందులో భాగంగానే, ఇవాళ మధ్యాహ్నం 2 గంటలకు బిఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ, లెజిస్లేటి పార్టీ సహా, రాష్ట్ర కార్యవర్గ.. సంయుక్త సమావేశం నిర్వహించనున్నారు ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్ రావు. తెలంగాణ భవన్ లో బిఆర్ఎస్ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్ రావు అధ్యక్షతన సమావేశం జరుగనుంది.