కవితను ఈడీతో బెదిరిస్తున్నారు – వినయ్ భాస్కర్

-

ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను ఈడీతో బెదిరిస్తున్నారని ఆరోపించారు ప్రభుత్వ చీఫ్ విప్ వినయ్ భాస్కర్. మహిళా రిజర్వేషన్ కోసం పోరాడుతున్నందుకే ఈ విధంగా దర్యాప్తు సంస్థలతో బెదిరిస్తున్నారని మండిపడ్డారు. కవితను ఇబ్బంది పెడితే దేశ ప్రజలు తిరగబడతారని హెచ్చరించారు వినయ్ భాస్కర్. కవితను అరెస్టు చేస్తే వరంగల్ భగ్గుమంటుందని అన్నారు. బండి సంజయ్ మహిళలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.

బిజెపి పాలనలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందని.. సిబిఐ, ఈడి, ఐటి బిజెపి జేబు సంస్థలుగా మారాయని మండిపడ్డారు. దేశ సంపదను దోచుకుంటున్న అంబానీ, ఆదానీలపై ఈడి, సిబిఐ, ఐటీ దాడులు చేయాలని డిమాండ్ చేశారు. రైతు సమస్యలపై ఉద్యమం చేస్తుంటే.. రైతులను ఉగ్రవాదులుగా, దేశద్రోహులుగా చిత్రీకరిస్తున్నారని అన్నారు. ఇక ఈనెల 23వ తేదీన హనుమకొండలో మంత్రి కేటీఆర్ పర్యటించనున్నట్లు తెలిపారు వినయ్ భాస్కర్.

Read more RELATED
Recommended to you

Latest news