బాల్క సుమన్ పై ఎఫ్ఐఆర్ నమోదు చేయడం ప్రజాస్వామ్యానికి గొడ్డలి పెట్టు – కవిత

-

బాల్క సుమన్ పై ప్రభుత్వం ఎఫ్ఐఆర్ నమోదు చేయడంపై కల్వకుంట్ల కవిత స్పందించారు. బీఆర్ఎస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే , దళిత బిడ్డ బాల్క సుమన్ పై ప్రభుత్వం ఎఫ్ఐఆర్ నమోదు చేయడం ప్రజాస్వామ్యానికి గొడ్డలి పెట్టు అంటూ నిప్పులు చెరిగారు కవిత. నాడు ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అవలంభించిన విధానాలనే నేడు తెలంగాణలో ఉన్న ఢిల్లీ రిమోట్ కంట్రోల్ పాలన కూడా అవలంభించడం రాచరిక వ్యవస్థను తలపిస్తుందని మండిపడ్డారు కవిత.

kavitha reaction on balka suman fir issue

సూర్యుని పై ఉమ్మేస్తే అది తిరిగి మీ మీదే పడుతుందన్న విషయాన్ని మర్చిపోకండని హెచ్చరించారు. కాంగ్రెస్ పార్టీ మెడలు వంచి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన కేసీఆర్ పై సీఎం రేవంత్ రెడ్డి అసభ్య పదజాలాన్ని ప్రయోగించినందుకు ముందుగా రేవంత్ రెడ్డి పై పోలీసులు వెంటనే కేసు నమోదు చేయాలని డిమాండ్‌ చేశారు. లేదంటే న్యాయస్థానాలను ఆశ్రయించి మీ వైఖరిని ఎండగడతామని హెచ్చరికలు చేశారు కవిత.

Read more RELATED
Recommended to you

Latest news