కెసిఆర్ కుటుంబ సభ్యుడికి 112 వైన్ షాపులు ఉన్నాయి..బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు..

-

కెసిఆర్ ప్రభుత్వం పై సంచలన వ్యాఖ్యలు చేశారు రాష్ట్ర అధ్యక్షుడు ఎంపీ బండి సంజయ్.హైదరాబాద్ డ్రగ్స్ కు అడ్డాగా మారడానికి కేరాఫ్ అడ్రస్ కెసిఆర్, టీఆర్ఎస్ ప్రభుత్వమే అని అన్నారు.హైదరాబాదులో వరుస డ్రగ్స్ కేసులు సంచలనం సృష్టిస్తున్నాయి. బంజారాహిల్స్ ప్రాంతంలోని రాడిసన్ బ్లూ పబ్ పై దాడి చేయగా పార్టీ గుట్టు బయటపడినన సంగతి తెలిసిందే.డ్రగ్స్ దందా పై తీసిన “ఉడ్తా” పంజాబ్ సినిమా మాదిరిగా ‘ఉడ్తా హైదరాబాద్ ‘ సినిమా తీసే పరిస్థితి వచ్చిందన్నారు సంజయ్.

రాష్ట్రంలో చాలా డ్రగ్స్ కేసులు నమోదైన ఒక కేసును కూడా పూర్తిగా విచారించకుండా పక్కదోవ పట్టించిన ఘనత ఒక కేసీఆర్ కే దక్కుతుంది అన్నారు. రాష్ట్రంలో కెసిఆర్ కుటుంబ సభ్యుడికి 112 వైన్ షాపులు ఉన్నాయి అని చెప్పారు. డ్రగ్స్ కేసులో కేసీఆర్ కుటుంబానికి సంబంధం ఉందని, డ్రగ్స్ కేసు వివరాలు అందించాలని రాష్ట్ర ప్రభుత్వానికి ఈడీ లేఖ రాసిన కేసీఆర్ స్పందించలేదన్నారు బండి సంజయ్.

Read more RELATED
Recommended to you

Latest news