స్థానిక సంస్థలకు కేసీఆర్‌ గుడ్‌న్యూస్‌..ప్రతి నెల రూ.227 కోట్లు గ్రాంటు

-

తెలంగాణ రాష్ట్రంలోని స్థానిక సంస్థలకు కేసీఆర్ సర్కార్ శుభవార్త చెప్పింది. 2021-22 సంవత్సరానికి గాను ప్రతినెల ఏకంగా 227 కోట్ల గ్రాంటును క్రమం తప్పకుండా విడుదల చేస్తామని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఓ ప్రకటన ద్వారా తెలిపారు.

వీటిలో గ్రామ పంచాయతీలకు 210 కోట్లు, మండల పరిస్థితులకు 11 కోట్లు అలాగే జిల్లా పరిస్థితులకు ఐదు కోట్లు విడుదల చేస్తామని ప్రకటన చేశారు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. కేంద్ర ప్రభుత్వం నుంచి ఈ ఆర్థిక సంవత్సరంలో మొదటి విడతగా 682 కోట్లు అందాయని వెల్లడించారు.

రెండో విడత నిధులను కేంద్రం విడుదల వచ్చి లేకపోయినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం జనవరి నెలాఖరుకు ప్రతి నెలా ఈ మేర నిధులు గ్రాంటు గా విడుదల చేసిందని తెలిపారు. ఫిబ్రవరి నెల కు సంబంధించిన గ్రాంటును త్వరలో విడుదల చేస్తామని ప్రకటన చేశారు. నిధుల విడుదల పై పూర్తి సమాచారం తెలియకుండా కొంతమంది అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news