తెలంగాణలో వరద నష్టం పై కేసీఆర్‌ ప్రభుత్వం ప్రకటన

-

తెలంగాణలో వరద నష్టం పై కేసీఆర్‌ ప్రభుత్వం ప్రకటన చేసింది. వర్షాల వల్ల 139 గ్రామాలను తరలించి, 157 సహాయ కేంద్రాలు ఏర్పాటు చేసామని… 7870 కుటుంబాలకు సురక్షిత ప్రాంతాలకు తరలించామని వివరించింది. 756 చిన్నతరహా సాగునీటి చెరువులకు గండ్లు పడ్డాయి. పునరుద్ధరణ కోసం 171.1కోట్లు తక్షణ పునరుద్ధరణ కోసం 100 కోసం అవసరమని.. ఆర్ అండ్ బి శాఖకు సంబంధించిన మొత్తం 768 రోడ్లు, 527 రాష్ట్ర రోడ్లు, 37 జాతీయ రహదారులు, 6 రాజీవ్ రహదారులు దెబ్బతిన్నాయని వివరించింది. 198 భవనాలు దెబ్బ తిన్నాయి…ఇప్పటి వరకు 488 రాష్ట్ర రహదారులు, 29 జాతీయ రహదారులు పునరుద్ధరించామని తెలిపింది.


తాత్కాలిక పునరుద్ధరణ కోసం 253.77 కోట్లు, శాశ్వత పునరుద్ధరణ కోసం 1771.47 కోట్లు అవసరమని.. పంచాయతీరాజ్ శాఖకు సంబంధించిన 1517 రోడ్లు దెబ్బతిని ట్రాఫిక్ కు అంతరాయం ఏర్పడిందని పేర్కొంది. తాత్కాలిక పునరుద్ధరణ కోసం 187.71 కోట్లు, శాశ్వత పునరుద్ధరణ కోసం 1339.03 కోట్లు అవసరమని.. 1526.74 కోట్లు మొత్తంగా అవసరం. ఆగస్టు 8 తేదీ వరకు తాత్కాలిక పునరుద్ధరణ పనులు పూర్తి చేస్తామని స్పస్టం చేసింది కేసీఆర్‌ సర్కార్‌. పశు సంవర్ధక శాఖకు సంబంధించి 38 ఎద్దులు, 439 ఆవులు,14 కోడెలు, 399 గొర్రెలు, 81129 కోళ్ళు చనిపోయాయని.. మత్స్య పరిశ్రమకు సంబంధించి 2.18 కోట్ల నష్టం, 16.71 కోట్ల ఆస్తుల నష్టం జరిగిందని చెప్పింది. మున్సిపాలిటీలలో రోడ్లు, డ్రైన్లు, కల్వర్టు, వీధి దీపాల శాశ్వత పునరుద్ధరణ కోసం 380 కోట్లు అవసరమని.. జీహెచ్ఎంసిలో రోడ్ల పునరుద్ధరణ కోసం 255.66కోట్లు అవసరమని తెలిపింది.

Read more RELATED
Recommended to you

Latest news