సికింద్రాబాద్ ఎంపీ అభ్యర్ధిగా పద్మారావు పేరు ఖరారు చేసిన కేసీఆర్

-

సికింద్రాబాద్ పార్లమెంట్ బీఆర్ఎస్ అభ్యర్థి విషయమై రోజుకో కొత్త పేరు వినిపిస్తోంది. నిన్న, మొన్నటి వరకు మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పోటీ చేయనున్నట్లు ప్రచారం జరిగిన విషయం తెలిసిందే. తాజాగా మాజీ మంత్రి పద్మారావు గౌడ్ పేరు  బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రకటించారు.
సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో బలమైన అభ్యర్థిని నిలిపేందుకు కేసీఆర్ వ్యూహం రచించాడు.

ఇందులో భాగంగా తలసాని శ్రీనివాస్ యాదవ్ పేరు మొదట వినిపించినప్పటికీ.. ఆయన మౌనం వహించడంతో పద్మారావు గౌడ్ వైపు కేసీఆర్ మొగ్గు చూపినట్లు సమాచారం.  స్థానిక నేత కావడంతో పాటు నియోజకవర్గంపై మంచి పట్టు ఉండడంతో పద్మారావు గౌడ్ అయితే బాగుంటుందని పార్టీ వర్గాలు భావించాయి. ఇవాళ పార్టీ ఎమ్మెల్యేలు, కార్యకర్తలతో సీఎం కేసీఆర్ చర్చించి పద్మారావు పేరు ఫైనల్ చేశాడు.

2002లో టీఆర్ఎస్ పార్టీలో చేరిన పద్మారావు గౌడ్.. 2004లో మొదటి సారి అసెంబ్లీకి ఎన్నికయ్యారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సికింద్రాబాద్ నియోజకవర్గం నుంచి 2014, 2018, 2023 అసెంబ్లీ ఎన్నికల్లో వరుసగా విజయం సాధించి హ్యాట్రిక్ కొట్టారు. తెలంగాణ తొలి కేబినెట్ లో మంత్రిగా కూడా వ్యవహరించారు. ప్రస్తుతం సికింద్రాబాద్ ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. ఈసారి ఖైరతాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ తరపున గెలిచిన దానం నాగేందర్, సికింద్రాబాద్ నుంచి గెలిచిన పద్మారావుతో పాటు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి మధ్యనే టఫ్ ఫైట్ జరిగే అవకాశం కనిపిస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news