టిఆర్ఎస్ ఎమ్మెల్యేలపై కేసీఆర్ కి విశ్వాసం లేదు – కిషన్ రెడ్డి

-

సీఎం కేసీఆర్ కి తన పార్టీ ఎమ్మెల్యేలపై విశ్వాసం లేదన్నారు కేంద్రం మంత్రి కిషన్ రెడ్డి. కేసీఆర్ చూపెట్టిన వీడియోలో ఏముందో మాకు అర్ధం కాలేదన్నారు. తెలంగాణ లో ఏ విషయం ఉన్నా అధిష్టానం మాతో మాట్లాడుతుందని.. మాకు టీఆరెస్ ప్రభత్వం పడిపోవాలని లేదని స్పష్టం చేశారు. కేసీఆర్ ముందే రాజీనామా చేస్తా అన్నా మాకు షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలు జరగాలని ఉందన్నారు కిషన్ రెడ్డి.

కొడుకు ముఖ్యమంత్రి కావాలని కేసీఆర్ ఈ ప్రయత్నాలు చేస్తున్నాడని ఆరోపించారు. టిఆర్ఎస్ ఎమ్మెల్యేలను కొనే ఖర్మ మాకు లేదన్నారు. స్పెషల్ స్టేటస్ పేరుతో గతంలో టిడిపి సర్కార్ మాపై బురద జల్లిందని.. ఇప్పుడు టీఆరెస్ ఇలా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. నేను రోజు వెయ్యి మందితో ఫోటో దిగుతా.. బయటి వ్యక్తి ద్వారా బేరసారాలు జరిపే ఖర్మ మాకు లేదన్నారు.

మొయినాబాద్ ఫామ్ హౌస్ వ్యవహారంపై బిజెపి మొదట్నుంచీ ప్రత్యేక విచారణ కావాలని కోరామన్నారు. సీబీఐ, సీఐడీ లను అడ్డుకునేందుకు పాత తేదీలతో జీవో లు ఇచ్చారని అన్నారు. టీఆరెస్ పార్టీలో చేరిన ఎమ్మెల్యేలలో ఒక్కరితో నైనా రాజీనామా చేయించారా? అని ప్రశ్నించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version