ఎన్నికల ప్రచారంలో సీఎం కేసీఆర్ దూసుకుపోతున్నారు. నిన్న ఏకంగా మూడు బహిరంగ సభల్లో ప్రసంగించిన సీఎం కేసీఆర్.. ఇవాళ ఖమ్మం జిల్లాలో అడుగుపెట్టనున్నారు. ఇందులో భాగంగానే నేడు ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గంలో సీఎం కేసీఆర్… బహిరంగ సభలో పాల్గొంటారు.
జీళ్లచెర్వు లో పాలేరు ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి విజయాన్ని కాంక్షిస్తూ సీఎం కేసీఆర్ బహిరంగ సభ ఉండనుంది. పాలేరు నియోజకవర్గంలో ఎలాగైనా గెలవాలని సీఎం కేసీఆర్ వ్యూహాలు చేస్తున్నారు. పాలేరు నియోజకవర్గంలో తుమ్మల కూడా పోటీ చేసే ఛాన్స్ ఉంది. అటు షర్మిల కూడా పోటీలో ఉన్నారు. ఇలాంటి తరుణంలో ఇవాళ్టి సభలో సీఎం కేసీఆర్ ప్రసంగం ఎలా ఉంటుందో చూడాలి.
కాగా తాజాగా సీఎం కేసీఆర్ అచ్చంపేట సభలో మాట్లాడుతూ ఎన్నికల ఫలితం ఏ విధంగా వస్తుందో అన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు. రానున్న ఎన్నికల్లో తెలంగాణ ప్రజలు కనుక మమ్మల్ని ఓడిస్తే రెస్ట్ తీసుకుంటామని చాలా కామెడీ గా కామెంట్ చేశాడు.. కానీ ఇక్కడ మరో తిరకాసు పెట్టాడు ప్రజలకి, మమ్మల్ని ఓడిస్తే మేము హాయిగా ప్రతిపక్షములో ఉండి రెస్ట్ తీసుకుంటామన్నారు.