KCR: ఇవాళ తెలంగాణ భవన్‌కు మాజీ సీఎం కేసీఆర్

-

KCR: తెలంగాణ భవన్‌కు మాజీ సీఎం కేసీఆర్ రానున్నారు. ఇవాళ మధ్యాహ్నం 12 గంటల తర్వాత తెలంగాణ భవన్‌ కు బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ రానున్నారు. ఈ సందర్భంగా తెలంగాణ భవన్‌ లో పార్టీ నేతలతో సమావేశం కానున్నారు కేసీఆర్. పార్లమెంట్ ఎన్నికల సన్నాహకాలపై నేతలతో ఆయన చర్చించనున్నారు.

KCR is the former CM of Telangana Bhavan today

ఇక నల్లగొండ జిల్లా కేంద్రంలో ఏదో ఒక నియోజక వర్గంలో మాజీ సీఎం కేసీఆర్ భారీ బహిరంగ సభ ఉంటుందట. ఈ నెల మూడో వారంలో కేసీఆర్ సభ ఉండే అవకాశం ఉన్నట్లు సమాచారం అందుతోంది. 2 లక్షల మందితో ఫిబ్రవరి మూడో వారంలో కేసీఆర్ భారీ బహిరంగ సభ ఉంటుంది.

కృష్ణా జలాలు, కేఆర్ఎంబీ పై వాస్తవాలు ప్రజలకు వివరించడమే టార్గెట్‌గా, కృష్ణా జలాల్లో తెలంగాణ రాష్ట్ర హక్కుల సాధనే లక్ష్యంగా ఉమ్మడి నల్లగొండ జిల్లాలో బీఆర్ఎస్ పార్టీ భారీ సభ నిర్వహించనుంది.నల్లగొండ జిల్లా నుండే KRMB ఇష్యూ పై పోరాటానికి బీఆర్ఎస్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం అందుతోంది. ఈ భారీ సభపై ఇప్పటికే పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్.

Read more RELATED
Recommended to you

Latest news