మీకు అండగా నేనుంటా.. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు కేసీఆర్‌ భరోసా

-

‘‘ఎలాంటి క్లిష్ట పరిస్థితుల్లోకి మిమ్మల్ని నెట్టినా.. ఏ దశలోనైనా మీకు నేను అండగా ఉంటాను. నన్ను కూడా అనేక విధాలుగా ఇబ్బందులకు గురిచేసేందుకు ప్రభుత్వం కుట్రలు చేస్తోంది. ఆ కుట్రలను చట్టప్రకారం ఎదుర్కొందాం’’ అని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు ఆ పార్టీ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ భరోసా ఇచ్చారు. ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రంలో కేసీఆర్‌తో పలువురు గులాబీ పార్టీ ఎమ్మెల్యేలు, నేతలు బుధవారం భేటీ అయ్యారు. ఈ సందర్భంగా కేసీఆర్ వారికి భరోసా కల్పించారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం అనేక రకాలుగా ప్రలోభాలకు పాల్పడుతూ.. ఒత్తిడికి గురిచేస్తూ.. లొంగదీసుకోవడానికి ప్రయత్నిస్తోందని, ఎట్టి పరిస్థితుల్లోనూ ధైర్యాన్ని కోల్పోవద్దని కేసీఆర్ అన్నారు.

కాంగ్రెస్‌ ప్రభుత్వం పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తోందన్న కేసీఆర్.. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై ఒత్తిడి తీసుకొచ్చి లొంగదీసుకోవడానికి అన్ని రకాల కుట్రలను ప్రయోగిస్తోందని మండిపడ్డారు. ఇలాంటప్పుడే తట్టుకొని నిలబడాలని.. ఒత్తిళ్లకు లోనుకావద్దని చెప్పారు. ఎట్టి పరిస్థితుల్లోనూ పార్టీ మారొద్దని పేర్కొన్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం ఎన్ని రకాలుగా ఇబ్బందులు సృష్టించినా.. అధైర్యపడొద్దని సూచించారు.

Read more RELATED
Recommended to you

Latest news