డిసెంబర్ లోపు సీఎం కేసీఆర్ ప్రగతి భవన్ ఖాళీ చేస్తారని జోష్యం చెప్పారు ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్. తనపై నమోదైన కేసుల విషయంలో సుప్రీంకోర్టును ఆశ్రయిస్తానని తెలిపారు. తనను తట్టుకోలేక తనపై ఉన్న పాత కేసులను తిరగతోడుతున్నారని ఆరోపించారు కేఏ పాల్.
తనను డబ్బులతో కొనలేరని అన్నారు. దేశాన్ని అప్పులపాలు చేస్తున్నారు కాబట్టే తాను రాజకీయాలలోకి వచ్చానన్నారు. 2010లో తన సోదరుడి హత్య జరిగినప్పుడు తాను అమెరికాలో ఉన్నానని, ఆ కేసులో 8 మందిని అరెస్టు చేశారని గుర్తు చేసుకున్నారు. గతంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి, సోనియా గాంధీ తనను చంపేందుకు ప్రయత్నించారని బాంబు పేల్చారు. అయితే తనని నాశనం చేద్దామని చూసిన వారు ఇప్పుడు ఎవరూ లేరన్నారు.
తన సోదరుడి హత్యకు తానే కోటి ఇచ్చానంటూ తనపై తప్పుడు కేసు పెట్టారని, ఆ తర్వాత అది తప్పుడు కేసు అని నిరూపితమైందన్నారు. తనపై తప్పుడు కేసుల విషయంలో సుప్రీంకోర్టుని ఆశ్రయిస్తున్నట్లు తెలిపారు. కనీసం కుక్కల నుంచి కూడా ప్రజలను కాపాడలేకపోతున్నారంటూ సెటైర్లు వేశారు. కెసిఆర్ కళ్ళు మూసుకుని పాలు కాదు.. మందు తాగుతున్నాడని అన్నారు.