తెలంగాణా సాంస్కృతిక సారధి ఉద్యోగులకు కేసీఆర్ సర్కార్ శుభవార్త చెప్పింది. తెలంగాణా సాంస్కృతిక సారధి ఉద్యోగులకు పీఆర్సీ అమలుచేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది సాంస్కృతిక, యువజన సర్వీసులు, పర్యాటక శాఖ. పెంచిన పీఆర్సీ 2021, జూన్ 1 వ తేదీ నుంచి వర్తింపు చేసేలా కీలక నిర్ణయం తీసుకుంది కేసీఆర్ ప్రభుత్వం. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆమోదంతో ఇవాళ ఉత్తర్వులు జారీ చేశారు అధికారులు.
తెలంగాణా సాంస్కృతిక సారధి ఉద్యోగుల ప్రస్తుత పే స్కేలు ₹24514 గా ఉంది. ఇక పీఆర్సీ అమలుతో ఒక్కొక్కరికి ₹ 7300ల మేరకు జీత భత్యాలు పెరిగే అవకాశం ఉంది. ఇది ఇలా ఉండగా, తెలంగాణ రాష్ట్ర ఫుడ్ కమిషన్ చైర్మన్ గా గోలి శ్రీనివాస్ రెడ్డి నియామకం అయ్యారు. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నాగర్ కర్నూల్ జిల్లా వెల్దండ మండలం నారాయణపూర్ గ్రామానికి చెందిన గోలి శ్రీనివాస్ రెడ్డికు తెలంగాణ రాష్ట్ర ఫుడ్ కమిషన్ చైర్మన్ పదవి కట్టబెట్టారు.