తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావుకు ఊహించని షాక్ తగిలింది. నిన్న అర్థరాత్రి రాత్రి బాత్రూంలో జారి కింద పడడంతో సీఎం కేసీఆర్ కు గాయాలు అయినట్లు సమచారం అందుతోంది.
దీంతో సికింద్రాబాద్ యశోద హాస్పటల్ కు మాజీ సీఎం కేసీఆర్ ను ఆయన కుటుంబ సభ్యులు తరలించినట్లు సమచారం అందుతోంది. మాజీ సీఎం కేసీఆర్ నడుము భాగాన లైట్ క్రాక్ రావడంతో వైద్యం అందిస్తున్నారని సమాచారం. అర్ధరాత్రి రెండున్నర గంటలకు ఈ ఘటన జరిగిందని తెలుస్తోంది.