నల్గొండ బీఆర్ఎస్ భారీ బహిరంగ సభలో పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ జై తెలంగాణ అని నినాదం ఇచ్చారు. అనంతరం ఆయన తన ప్రసంగాన్ని మొదలుపెట్టారు. అయితే ఎప్పటిలాగా ఆయన వేదికపై నిల్చొని ప్రసంగించకుండా.. కుర్చీలో కూర్చొనే మాట్లాడుతున్నారు. నిలుచొని ప్రసంగించడానికి తన కాలు సహకరించడం లేదని, ఇం కా పూర్తిగా కోలుకోలేదని అన్నారు. తన ఆరోగ్యం సహకరించకపోయినా ప్రజల కోసం ఇప్పుడు తాను ప్రజాక్షేత్రంలోకి వచ్చానని తెలిపారు.
“24 ఏళ్ల నుంచి పక్షిలా తిరుగుతూ నేను చెబుతున్నాను. నీళ్లు లేకపోతే మనకు బతుకులేదని. నల్గొండలో లక్షా యాభై వేల మంది బిడ్డల నడుములు ఫ్లోరైడ్‌తో వంగిపోయినయి. ఆ బిడ్డలను ప్రధాన మంత్రి వద్దకు తీసుకుపోయినా పట్టించుకున్న వాళ్లు లేరు. బీఆర్ఎస్ సర్కార్ వచ్చిన తర్వాతే నల్గొండ ఫ్లోరైడ్ రహిత జిల్లాగా మారింది. భగీరథ నీళ్లు వచ్చినప్పటి నుంచి ఫ్లోరైడ్ బాధలు పోయినయని ప్రజలు చెప్పుతుండ్రు.” అని మాజీ సీఎం కేసీఆర్ అన్నారు.