నేడు వరంగల్ జిల్లాకు కేసీఆర్ పయనం కానున్నారు. భారత రాష్ట్ర సమితి అధినేత కేసీఆర్ లోక్ సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం వరంగల్ నగరానికి వస్తున్నా రు. వరంగల్ లోక్ సభ అభ్యర్థి సుధీర్ కుమార్ తరపున హనుమకొండ లో రోడ్ షో నిర్వహించనున్నారు.
ఆదివారం సాయంత్రం 4 గంటలకు నగరానికి చేరుకునే కేసీఆర్.. నేరుగా కెప్టెన్ లక్ష్మీకాంతరావు నివాసానికి చేరుకుని కాసేపు విశ్రాంతి తీసుకుంటారు. అనంతరం జిల్లా నేతలతో కలిసి బస్సులో అదాలత్ సెంటర్, అంబేద్కర్ సెంటర్, పెట్రోల్ పంపు జంక్షన్ మీదుగా హనుమకొండ చౌరస్తాకు చేరుకుంటారు. చౌరస్తాలో ఏర్పాటు చేసిన సభలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రసంగిస్తారు.