నేడు కరీంనగర్ లో కేటీఆర్ పర్యటన..షెడ్యూల్ ఇదే

-

నేడు కరీంనగర్ పార్లమెంట్ పరిధిలోని నాలుగు నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పర్యటన ఉండనుంది. ఇందులో భాగంగానే ఇవాళ ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంటల వరకు వేములవాడ టౌన్ లోని మహారాజా ఫంక్షన్ హాల్లో వేములవాడ నియోజకవర్గ బూత్ కమిటీ స్థాయి కార్యకర్తల సమావేశంలో పాల్గొంటారు.

KTR on Goverdhan Bajireddy

ఇక ఇవాళ మధ్యాహ్నం 1:30 గంటల నుంచి మధ్యాహ్నం 3:30 గంటల వరకు మానకొండూరు నియోజకవర్గంలోని అలుగునూర్ చౌరస్తా వద్ద లక్ష్మీనరసింహ ఫంక్షన్ హాల్లో బూత్ కమిటీ స్థాయి సమావేశంలో పాల్గొంటారు. సాయంత్రం 4 గంటల నుంచి 6 గంటల వరకు కరీంనగర్ టౌన్ లోని గీతాభవన్ వద్ద పద్మనాయక ఫంక్షన్ హాల్లో బూత్ కమిటీ స్థాయి సమావేశంలో పాల్గొంటారు. సాయంత్రం 6:30 గంటలకు చొప్పదండి నియోజకవర్గ కేంద్రంలో భారీ రోడ్ షోలో పాల్గొంటారు.

Read more RELATED
Recommended to you

Latest news