రైతుల చెప్పులతో కొడితే.. పండ్లు రాలతాయి అని సీఎం రేవంత్ రెడ్డికి మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ వార్నింగ్ ఇచ్చారు. నల్గొండలో జరిగిన ఛలో నల్గొండ బహిరంగ సభలో ప్రసంగించారు కేసీఆర్. బీఆర్ఎస్ పాలనలో 24 గంటల కరెంట్ సరఫరా చేశామని.. దద్దమ్మల పాలనలో ఇలాగే ఉంటుందని మాజీ సీఎం కేసీఆర్ తెలిపారు. ప్రజలు తమకు ప్రతిపక్ష మోదాను కట్టబెట్టారని.. బిడ్డా ఛలో నల్గొండ సభతో మా పోరు ఆపేది లేదన్నారు. దద్దమ్మలకు పాలన చేతకాక 24 గంటల కరెంట్ ఇవ్వడం చేతకావడం లేదని ధ్వజమెత్తారు.
కేసీఆర్ సీఎం పదవీ నుంచి తప్పుకోగానే ఏం మాయ రోగం వచ్చిందని.. ఎందుకు కరెంట్ కట్ అవుతోందంటూ ప్రశ్నించారు. అధికారంలోకి వచ్చిన రెండు నెలలు గడుస్తున్నా.. రైతులకు ఇంకా రైతుబంధు ఇవ్వలేకపోయారంటూ నిలదీశారు. నీళ్లు, కరెంట్ విషయంలో తాము ప్రజలతో కలిసి ఎక్కడికక్కడ ప్రభుత్వాన్ని నిలదీస్తామన్నారు. రాష్ట్రంలో కరెంట్ సమస్యలను వెంటనే పరిష్కరించాలి.. లేదంటే వదలం, వెంటాడుతామని మాజీ సీఎం కేసీఆర్ సవాల్ విసిరారు.