తెలంగాణ ప్రజలకు సీఎం కేసీఆర్ బోనాల పండుగ శుభాకాంక్షలు

-

ఆషాఢ మాసం రావడంతో హైదరాబాద్ మహానగరంలో బోనాల పండుగ సందడి మొదలైంది. ఆదివారం నాడు గోల్కొండ జ‌గ‌దాంబికా అమ్మ‌వారికి తొలి బోనం స‌మ‌ర్పించ‌డంతో.. భాగ్యనగరంలో బోనాల పండుగ షురూ అవుతుంది. గోల్కొండ బోనాలు ముగిసిన త‌ర్వాత వారం ల‌ష్క‌ర్‌, లాల్‌దర్వాజా మాతామహేశ్వరి, సికింద్రాబాద్​ ఉజ్జయిని మహంకాళి, షాలిబండ అక్కన్న మాదన్న మహంకాళి, ధూళ్‌పేట‌, బ‌ల్కంపేట‌, పాతబ‌స్తీ అమ్మ‌వారి ఆల‌యాల్లో నెలంతా ఈ బోనాల పండుగ జ‌రుపుకోనున్నారు.

 బోనాల పండుగ /bonala panduga
బోనాల పండుగ /bonala panduga

గతేడాది కరోనా కారణంగా ఇంట్లోనే పండుగ జరుపుకోవాలని ప్రభుత్వం చెప్పడంతో బోనాల ఉత్సవాలు నిరాడంబరంగా జరిగాయి. ఈ ఏడాది కరోనా నిబంధనలు పాటిస్తూ అంగరంగ వైభవంగా బోనాల ఉత్సవాలను జరపాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇక బోనాల పండుగ నేపథ్యంలో హైదరాబాద్ నగరంలో పోలీసులు పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు తలెత్తకుండా సీసీ కెమెరాలతో నిత్యం పర్యవేక్షణ చేస్తున్నారు.

బోనాల పండుగ ప్రారంభం సందర్భంగా తెలంగాణ ప్రజలకు ముఖ్యమంత్రి కేసీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. గోల్కొండ లోని జగదాంబికా అమ్మవారికి బోనం సమర్పించడంతో ప్రారంభమయ్యే బోనాల ఉత్సవాలు, తెలంగాణ సబ్బండ వర్ణాల గంగా జమునా తెహజీబ్ కు ప్రతీకగా నిలుస్తాయని సీఎం తెలిపారు. అమ్మవారి దీవెనతో, ప్రభుత్వ పట్టుదలతో తెలంగాణ రాష్ట్రం దేశానికే భోజనం పెట్టే అన్నపూర్ణగా మారిందన్నారు. తెలంగాణ ప్రజలు సుఖ సంతోషాలతో, ఆయురారోగ్యాలతో సుభిక్షంగా జీవించేలా అమ్మవారి ఆశీస్సులు కలకాలం కొనసాగాలని సీఎం ప్రార్థించారు.

 

Read more RELATED
Recommended to you

Latest news