తెలంగాణ మొట్టమొదటి సీఎం కేసీఆర్.. మళ్లీ రీ-ఎంట్రీ ఇస్తున్నారు. తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో వచ్చిన ఫలితాలు పార్లమెంట్ ఎన్నికల్లో పునరావృతం కాకుండా బీఆర్ఎస్ పార్టీ ఆచితూచి అడుగులు వేస్తోంది. ఈ తరుణంలోనే..ఇవాళ బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ సమావేశం కానుంది. బీఆర్‌ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ అధ్యక్షతన సిద్దిపేట జిల్లా ఎర్రవల్లిలోని వ్యవసాయ క్షేత్రంలో భేటీ జరగనుంది.
రానున్న పార్లమెంట్ సమావేశాల నేపథ్యంలో పార్టీకి చెందిన లోక్ సభ, రాజ్యసభ సభ్యులతో కేసీఆర్ సమావేశం కానున్నారు. పార్లమెంట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహం, పార్టీ వైఖరిపై భేటీలో చర్చించనున్నారు.
లోక్ సభ ఎన్నికలకు ముందు జరుగుతున్న చివరి సమావేశాలు కావడంతో కీలక బిల్లులు సహా ఇతర అంశాల్లో పార్టీ అనుసరించబోయే వైఖరి కీలకం కానుంది. ఇవాళ మధ్యాహ్నం 12:30 కి ఎర్రవల్లిలోని తన వ్యవసాయ క్షేత్రంలో బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ సమావేశం నిర్వహించనున్నారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. ఇందులో లోక్‌సభ ఎంపీలు, రాజ్యసభ ఎంపీలు, పార్టీ సీనియర్ నేతలు హాజరుఅవుతారు.