మామూలు ఎమ్మార్వో కాదు గురూ…!

-

మరో వివాదంలో భూవివాదంలో తాసిల్దార్ నాగరాజు చిక్కుకున్నాడు అని తెలుస్తుంది. కీసర గ్రామ రెవెన్యూ పరిధిలోని సర్వేనెంబర్ 173, 174, 175, 179 ,230 లలోని మొత్తం 94 ఎకరాల భూమిని… 38 కౌలుదారులకు ఒక్కొక్క కుటుంబానికి 9 ఎకరాలు భూమి అప్పటి ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు హయాంలో భూ పంపిణీ చేసారు. దీంట్లో 18 ఎకరాల భూమిని రెండు కుటుంబాలు విక్రయించాయి. భూమి ని కబ్జా చేసినా సరే రెవెన్యూ అధికారులు పట్టించుకోక పోవడంతో 40 రోజులు గా భూమి ఎదుట గతంలో తమ భూమి తమకు దక్కాలని ధర్నా చేసారు బాధితులు.

ఈ భూమి కోసం హైకోర్టును ఆశ్రయించారు. కోర్టు కేసులో ఉండగా ఎమ్మార్వో నాగరాజు భూ మార్పిడి చేసి వేరే వ్యక్తులకు పాస్ బుక్కులు కూడా జారీ చేశాడని ఆరోపణలు వస్తున్నాయి. భూ మార్పిడి చేయడం వల్లేనే హెచ్ఎండిఏ అధికారులు వెంచర్ చేయడానికి అనుమతులు ఇచ్చారు అని ఆరోపణలు వస్తున్నాయి. వ్యవసాయ భూమిని ప్లాట్ల కోసం భూ మార్పిడి చేశాడని తాసిల్దార్ నాగరాజు పై ఆరోపణలు ఉన్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news