ఇటీవల కరోనా బారిన పడి చికిత్స పొందుతున్న భారత మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆరోగ్య పరిస్థితి ఇంకా విషమంగానే ఉంది. ఆయన ఆరోగ్య పరిస్థితి పై హెల్త్ బులిటెన్ విడుదల చేసింది ఢిల్లీ ఆర్మీ రీసెర్చ్ అండ్ రిఫరల్ హాస్పిటల్. ప్రణబ్ ముఖర్జీ ఆరోగ్య పరిస్థితిలో ఎటువంటి మార్పు లేదని వెంటిలేటర్ సపోర్ట్ పై చికిత్స పొందుతున్నారని ఆర్మీ హాస్పిటల్ వెల్లడించింది.
ప్రణబ్ ముఖర్జీ ఆరోగ్య పరిస్థితిని పర్యవేక్షిస్తున్న వైద్య నిపుణులు కూడా ఆయన ఆరోగ్యంపై ఏమీ చెప్పలేని పరిస్థితి నెలకొంది అనే చెప్పాలి. ప్రస్తుతం ఆయన వెంటిలేటర్ పై చికిత్స తీసుకుంటున్నా సరే కోలుకుంటారు అనే నమ్మకం తమకు ఉందని చెప్తుంది ఆయన కుటుంబం. ఆయనకు ఇటీవల ఒక సర్జరీ చేసారు వైద్యులు. అప్పటి నుంచి ఆయన ఆరోగ్యం క్రమంగా విషమంగా మారింది.