జహీరాబాద్ లో BRS పార్టీకి కీలక నేత గుడ్ బై..?

-

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో పార్టీలన్నీ దూకుడు పెంచాయి. పార్టీలోకి చేరికలపై దృష్టి పెట్టాయి. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ ఇతర పార్టీలలో అసంతృప్తిగా ఉన్న నేతలపై దృష్టి పెట్టి వారికి గాలం వేస్తోంది. దీంతో కాంగ్రెస్‌లోకి వలసలు భారీగానే పెరుగుతున్నాయి. మరోవైపు బీజేపీ కూడా పలువురు నేతలను ఆకర్షిస్తోంది. ఇటీవలే భారత ప్రధాని నరేంద్ర మోడీ ములుగు జిల్లాలో సమ్మక్క-సారక్క గిరిజన యూనివర్సిటీ, జాతీయ పసుపు బోర్డు లను ప్రకటించారు. 

తాజాగా ఇవాళ వాటికి కేంద్ర కేబినేట్ ఆమోదం తెలిపింది. పసుపు బోర్డుకు నోటిఫికేషన్ కూడా జారీ చేసింది కేంద్ర ప్రభుత్వం. ఈ నేపథ్యంలో వచ్చే అసెంబ్లీ ఎన్నికలు చాలా కీలకం కానున్నాయి. ఇదిలా ఉంటే.. తాజాగా జహీరాబాద్ లో  BRS పార్టీకి కీలక నేత గుడ్ బై చెప్పనున్నట్టు సమాచారం. సామాజిక ఉద్యమ కారుడు ఢిల్లీ వసంత్ పార్టీని వీడే ఆలోచనలో ఉన్నారు. కొద్ది రోజుల క్రితం అసెంబ్లీ ఎన్నికల్లో  టికెట్ ఆశించి మంత్రి హరీష్ రావు సమక్షంలో  BRS లో చేరారు. ఎమ్మెల్యే టికెట్ ఇవ్వకపోవడంతో గత కొన్ని రోజులుగా అసంతృప్తితో ఉన్నారు ఢిల్లీ వసంత్. త్వరలో బీజేపీలో చేరుతారని ప్రచారం జరుగుతోంది. 

Read more RELATED
Recommended to you

Latest news