దేశ వ్యాప్తంగా ఇప్పుడు ఒక్కటే విషయం. మణిపూర్ లో మహిళలను నగ్నంగా ఊరేగించిన సంఘటన ఇప్పుడు హాట్ టాపిక్ అయింది. ఈ నేపథ్యంలోనే.. మహిళలను నగ్నంగా ఊరేగించిన మణిపూర్ వీడియో తొలగించండి అంటూ కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది. మణిపూర్లో మహిళలను నగ్నంగా ఊరేగించిన వీడియో వైరల్ కావడంతో కేంద్ర ప్రభుత్వం స్పందించింది. ఆ వీడియోను తొలగించాలని ట్విటర్ సహా అన్ని సోషల్ మీడియా ఫ్లాట్ ఫాంలకు కేంద్రం ఆదేశాలు జారీ చేసింది.
వైరల్ అయిన వీడియో పాతదని దానిపై విచారణ కొనసాగుతోందని తెలిపింది. ఇక ఈ సంఘటనపై ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ స్పందించారు. ఇద్దరు మహిళలపై అమానవీయ ఘటన కలచివేసిందని మోదీ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటన 140 కోట్ల మంది భారతీయులను సిగ్గుపడేలా చేసిందని అన్నారు. మహిళల భద్రత విషయంలో రాజీ పడేది లేదని స్పష్టం చేశారు. నిందితులను విడిచిపెట్టబోమని భారత ప్రజలకు భరోసా ఇస్తున్నానని పార్లమెంట్ భవనం ముందు మీడియాతో మాట్లాడుతూ మోడీ మాటిచ్చారు.